తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం.. ఊట్కూరులో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
ఊట్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఊట్కూర్, జూలై 07: నారాయణపేట ఊట్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి గర్భిణిలు, బాలింతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ చింతా రవి పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటేశ్వరమ్మతో పాటు సూపర్వైజర్లు మాట్లాడుతూ..శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, ఎలాంటి ఇతర ఆహారం అవసరం లేదని అవగాహన కల్పించారు.
తల్లిపాలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడి ప్రసవానంతర సమస్యలు తగ్గుతాయని వివరించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఎంతో కీలకమని, ఇది శిశువు ఎదుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుందని చెప్పారు. ఆరు నెలల తర్వాత కూడా పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.
అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక భరత్, పిహెచ్ సి వైద్యురాలు సంతోషి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు, వార్డు సభ్యుడు మల్లేష్, సూపర్వైజర్లు సరోజ, గీత, అంజమ్మ, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, వెంకటేశ్వరమ్మ, పుష్ప, సునీత, పార్వతి, లక్ష్మీ, జయదేవి, రమాదేవి, హర్షియా పర్వీన్, రిజ్వానా బేగం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

