మరికల్, జూన్ 17: దేశంలో మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది భారతీయ జనతా పార్టీయేనని (BJP) ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో నారాయణపేట జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వడ్డే శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు భారత సైన్యం పవర్‌ను చూపించారని, మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా వారి ఆత్మ గౌరవాన్ని కాపాడారని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చింది కమలం పార్టీయేనని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం, ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఉపాధి హామీ పథకం కింద ప్రతి పల్లెలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు, విద్యుత్ లైట్లు హైమాస్ లైట్లు ఏర్పాటు చేసిన ఘనత మోదీ అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తమ సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్, మరికల్ మండల పార్టీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శెట్టి మహేష్, సోషల్ మీడియా ఇన్చార్జి నిఖిల్, పార్టీ నేతలు రమేష్, సురేందర్ గౌడ్, నాయకులు మోహన్ రెడ్డి, ఓం ప్రకాష్, కూసురు రవి, వెంకటేష్, మండల బీజేవైఎం అధ్యక్షుడు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.