మరికల్, జూన్ 23: జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) వర్ధంతిని పురస్కరించుకొని అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ మాట్లాడుతూ.. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నడిపించిన బాటలో బీజేపీ పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ బీజేపీని స్థాపించడంతో నేడు దేశంలో సురక్షిత పాలనను బీజేపీ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. స్థానిక చౌరస్తాలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రమేష్, సురేందర్ గౌడ్, నాయకులు శ్రీరామ్, మహేష్ శెట్టి, వెంకటేష్, మోహన్ రెడ్డి, చెన్నయ్య, ప్రకాష్, ప్రతాప్ రెడ్డి, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ధన్వాడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివరాజ్, రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, ఉదయభాను, గోవర్ధన్ గౌడ్, ఉమేష్ కుమార్, సురేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు సాగర్, నర్సింలు, బోయ రాములు తదితరులు పాల్గొన్నారు.