samagra sasya rakshana | మిరప, రబీ పంటల్లో సమగ్ర సస్యరక్షణపై మరికల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సునీత మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలు కత్తి పురుగు నివారణ, విత్తన శుద్ధి, ఎర్ర పంటలు, మిత్ర పురుగు నివారణ, పంటల మార్పిడి తదితరాంశాలపై రైతులతో పాటు రసాయన ఎరువుల దుకాణ డీలర్లకు అవగాహన కల్పించారు.
పురుగుల మందు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు పంటల సాగుపై శాస్త్రవేత్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎన్పీఎస్ఎస్ యాప్‌ను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, శాస్త్రవేత్తలు బసవన్న, ఉమా శంకర్, వెంకట్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రెహమాన్, ఏఈఓ పరశురాం రైతులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు