మరికల్, జులై 05 : లారీని ఆటో ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్ మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన పార్ధీవ్ (34) శుక్రవారం రాత్రి ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం 108లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. పార్ధీవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.