మరికల్, సెప్టెంబర్ 21 : పాఠశాలలు, వైద్యాశాలల్లో ప రిశుభ్రత పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను క్షు ణ్ణంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరల్ ఫీవర్లు వస్తున్నాయని తెలిసి కూడా ఆ పరి శుభ్రంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సర్పంచ్ పరిశుభ్రతపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. సమ స్య ఇలాగే ఉంటే పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో ఒక్కసారి మండలస్థాయి ఆధికారులు కచ్చితంగా పాఠశాలలు, వైద్యాశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనం నాణ్యతగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం తరగతి గుదులు, పాఠశాల ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తిరిగి చూశారు.
కేజీబీవీ విషయంపై సర్పంచ్ గోవర్ధన్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డీసీడీవో పద్మనళిని, పాఠశాల ప్రిన్సిపాల్ ఆనురా ధ, తాసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో యశోదమ్మ, ఉపసర్పంచ్ శివకుమార్, పాఠశాల సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.
ఆక్సిజన్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు
కొవిడ్ మూడో విడుత వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుం డా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం పట్టణంలో ని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. దవాఖాన పరిసరాలను పరిశీలించి, వై ద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది ఆక్సిజన్ అందక కొంతమంది ప్రాణాలను కోల్పోయారని, ఈసారి ఆ సమస్య తలెత్తకుండా, ఏ రోగి మరణించకుండా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రధానమంత్రికేర్ (ప్రధాన మంత్రి నిధి) డీఆర్డీవో సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాం టను కేటాయించారని వివరించారు.
అందులో భాగంగానే జిల్లాకు సంబంధించి జిల్లా దవాఖానకు ఈ నెల 15న 500 లీటర్ ఫర్ మినట్ ఆక్సిజన్ ఉ త్పత్తి చేసే ప్లాంట్ చేరినట్లు చెప్పారు. ఈప్లాంట్ ద్వారా జి ల్లా దవాఖానలో ఉన్న 100 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తిని చేసుకోవచ్చన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్ట ర్ మల్లికార్జున్ మాట్లాడుతూ దవాఖానలోని ప్రతి బెడ్‌కు 6 లీటర్ ఫర్ మినట్ను అందించగలమని, ఆక్సిజన్ పైప్‌లై న్ పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రంజిత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.