నారాయణపేట, అక్టోబర్ 16 : నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి.. ప్రజలకు సేవ చేసేందుకు మరోమారు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెపారు. దాదాపు ఐదేండ్ల కిందట తొడకొట్టి జిల్లా తెస్తానని చెప్పా.. ఆ హామీని నెరవేర్చడంతోపాటు నియోజకవర్గాన్ని రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పథంలో పయనించేలా చేశానన్నారు.
తాను ఎవరితోనైనా అప్పనంగా కప్పు చాయ్ కూడా తాగలేదని.. అలాంటి తన పై రోడ్డు విస్తరణ విషయంలో బాధితుల కు నష్ట పరిహారం చెల్లించినా ప్రతిపక్ష పార్టీల నాయకులు 92 కేసులు వేశారన్నారు. మంచి చేయడానికి రాని ప్రతిప క్ష నేతలు చెడు చేసేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటాయన్నారు. క రోనా వంటి కష్ట కాలంలో కూడా కేసు లు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని నానా తం టాలు పడ్డారన్నారు. అయినా పూర్తి చేసి వారి కుట్రలను పటాపంచెలు చేశామన్నారు.
త్వరలోనే పీఆర్ఎల్ఐ ద్వారా సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుగుతానని, ఇదే తన చిరకాల కోరిక అని తెలిపారు. మూడు గంటల కరెంటు కావా లా.. 24 గంటల కరెంటు కావాలా అనే ది రైతులు ఆలోచించుకోవాలన్నారు. ఎ మ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేశానని.. మ రోసారి ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వ స్తుందని, ప్రజల దీవెనలు సీఎం కేసీఆ ర్, తనపై ఉండాలన్నారు. వచ్చేనెల 6వ తేదీన సీఎం కేసీఆర్ పేటకు రానున్న సం దర్భంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికపై అద్భుత ప్రకటన వెలువడుతుందన్నారు. కాగా, దాదాపు 130 కిలోమీటర్ల మేర నియోజకవర్గ వ్యాప్తంగా కా ర్యకర్తలు బైక్ర్యాలీలో పాల్గొన్నారని, వా రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.