నాగర్‌కర్నూల్, జనవరి 23 : కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ఇందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డబ్బు లు తీసుకొని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం తో మనస్తాపానికి గురైన బాధితుడు రేకులపాడు నర్సింహ బుధవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సదరు నాయకుడి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనమని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్సపొందుతున్న రేకులపాడు నర్సింహను బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిలాష్‌రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
నర్సింహ భార్య, తల్లి, పిల్లలను పరామర్శించి మెరుగై న వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రేకులపాడు నర్సింహ, అతని అ క్క నాగపూరి శివలీల, మరోకరి నుంచి స దరు నాయకుడు పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీటీసీ దండు నర్సింహ పెద్దకొత్తపల్లిలో ప్లాట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని వేధిస్తున్నాడన్నారు. ఆరేండ్లుగా ఇప్పుడు అప్పుడూ అం టూ కాలయాపన చేస్తూ వారు కొనుగోలు చే సిన ప్లాట్లు చూపకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం వారి అ రాచకానికి పరాకాష్ట అన్నారు.
ఐదు రోజులకిందట ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పిలిపించి రోజు ఇంటికి తిప్పుకుంటున్నాడని కుటుంబ సభ్యులైన భార్య, తల్లి ఆరోపిస్తున్నారన్నారు. కూలీ పనులు చేసుకొని డబ్బు కూడబెట్టుకొని కొంత స్థలం కొనుగోలు చేసుకునేందుకు డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా ఇన్ని సంవత్సరాలుగా వేధించడం సరికాదన్నారు. రోజూ తిరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడం తో అతడి ఇంటి ముందే పు రుగు నివారణ మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంటే స్థానికులు జిల్లా దవాఖానకు తరలించారన్నారు. బాధితుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే జిల్లా యంత్రాంగానికి కానీ, పో లీస్ యంత్రాంగానికి కానీ చీమకుట్టినట్లు లే దని మండిపడ్డారు. పెద్దకొత్తపల్లిలో పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్ చేయలేదన్నారు. ఎవరి అండ చూసుకొని పోలీసులు కేసును నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. మంత్రి అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారన్నారు.
పేదలు, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా నర్సింహ కుటుంబానికి న్యాయం చేయాలని, దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్లాట్లకోసం పైసలిచ్చి ప్రాణం పోగొట్టుకోవడం ఏమిటని ఆకుటుంబం అడుగుతుంటే బాధ కలిగిస్తుందన్నారు. పెద్దకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు తీసుకొని స్పందించడం లేదన్నారు. సదరు ఎస్సైని సస్పెండ్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం గా నిసిగ్గుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దకొత్తపల్లి ఎస్సై సివిల్ పంచాయతీల్లో దూరుతున్నాడని, అలాంటి పోలీస్ అధికారిపై విచారణ జరిపించాలన్నారు. బుధవారం మధ్యాహ్నం జ రిగితే ఇంత వరకు కూడా కేసు రిజిస్టర్ కాకపోవడం దురదృష్టకరమన్నారు.
అధికార పా ర్టీ అండ చూసుకొని చెలరేగిపోతున్నా నాయ కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెం ట బీఆర్ఎస్ రా ష్ట్ర నాయకుడు అభిలాష్రా వు, జిల్లా నాయకులు రాజగౌడ్, వెంకట య్య, రవినాయక్, కిషన్నాయక్తోపాటు త దితరులు ఉన్నారు.