Maremma | టాలీవుడ్ యాక్టర్ రవితేజ సోదరుడైన నటుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం ‘మారెమ్మ’. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి మాచర్ల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తుండగా… వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. బోనాలు, శివసత్తుల నృత్యాలతో మొదలైన ఏదో అరిష్టంతో ఊరిలో ప్రాణాలు పోతుండటం, ఊరి జనాలు మారెమ్మ దేవతను వేడుకోవడం, దేవతకు ప్రీతిపాత్రమైన దున్న తప్పిపోవడం ఆ తర్వాత ఏం జరుగుతుందనే అంశాల నేపథ్యంలో కట్ చేసిన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు వాటి చుట్టూ కథాంశాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది.
టీజర్ చివరలో హీరో కాళ్లకు గజ్జెలతో నడుచుకుంటూ వచ్చే సీన్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ సినిమాను మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో మాధవ్ గుబురు గడ్డంతో, రగ్గడ్ లుక్‌లో, మాస్ స్టైల్‌తో కనిపిస్తూ.. లుంగీ కట్టుకొని కబడ్డీ మైదానంలోకి నడుచుకుంటూ వస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాడు.