J.D Chakravarthy | స్టేజీ పైనుంచి వెళ్ళిపోదామనుకున్నా.. హీరో చంద్రహాస్ ప్రవర్తనపై జేడీ చక్రవర్తి అసహనం
J.D Chakravarthy | టాలీవుడ్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే.
J.D Chakravarthy | టాలీవుడ్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో చంద్రహాస్ స్టేజీపై అసభ్య పదజాలం ఉన్న పాటను పాడటం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనపై ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం సినిమాకు ప్రచారం కల్పించడం కోసం ఇంత ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని, ఆ వేడుకలో జరుగుతున్నది చూసి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయానని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆ బూతు పదజాలం వినలేక వేడుక నుంచి మధ్యలోనే వచ్చేయాల్సిందని, అలా చేయనందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని జేడీ స్పష్టం చేశారు. ప్రేక్షకులను ఆకర్షించాలంటే సృజనాత్మకమైన ఆలోచనలు ఉండాలి తప్ప, ఇలాంటి జుగుప్సాకరమైన వేషాలు, అసభ్యకర భాష కాదని ఆయన హితవు పలికారు. ప్రమోషన్ల పేరిట రోత పుట్టించే పనులు చేస్తే ప్రేక్షకులు ఆదరించరని, సృజనాత్మకతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Attitude Star Chandrahas Singing Performance 🤯
— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

