ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో నరసన్న తాత బ్రహ్మోత్సవాలు ( Narasanna Brahmotsavam ) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధి చెందిన నరసన్న తాత ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నరసన్న తాత రథోత్సవం సందర్భంగా గ్రామంలో కలశఊరేగింపు నిర్వహించారు. పలువురు భక్తులు తమ ఇష్ట దైవానికి కానుకలు సమర్పించారు. వేడుకల్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం, ఇతర వసతులను కల్పించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, శంకర్ రెడ్డి, నరసింహ రెడ్డి, బలరాం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దొబ్బలి హనుమంతు, రమేష్, మహేందర్ రెడ్డి, లక్ష్మణ్, భీమ్ రెడ్డి, తిరుపతి గౌడ్, జగదీష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.