వెల్దండ మే 23 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ వీర నాగమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గంగకు వెళ్లుట, పుట్ట పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
వేద పండితులు, బైండ్ల పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగయ్య గౌడ్, నాగరాజు గౌడ్, నాగేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యాదయ్యగౌడ్, మల్లేష్ గౌడ్, వెంకటయ్య గౌడ్, ఆంజనేయ గౌడ్, వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.