కొల్లాపూర్, ఫిబ్రవరి 16: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న గనమోని కౌశిక్ అనే విద్యార్థి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఎస్ యుటిఎఫ్(TS UTF) నాయకులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి కౌశిక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ కౌశిక్ పాఠశాల నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లి ఇంట్లోనే మృతి చెందడం బాధాకరమన్నారు.
కౌషిక్ మరణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ ఉమ్మడి జిల్లా పూర్వ కార్యదర్శి బి నారాయణ, జిల్లా కార్యదర్శులు కె. శంకర్, పి మహేష్ బాబు, జన విజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షుడు ఎండీ మహమూద్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎండీ రబ్బాని పాషా, టీఎస్ యుటిఎఫ్ కొల్లాపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. వేణుమాధవ్ గౌడ్, సి.కురుమయ్య, పెంట్లవెల్లి మండల అధ్యక్షులు కుమారస్వామి, వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.