Temple Robbery | అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు బీసీ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పట్టపగలే వ్యక్తి ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు వ్యక్తిని పట్టుకుని అమరచింత పోలీసులకు అప్పగించారు.
ఇందుకు సంబంధించి దేవాలయం నిర్వాహకులు పారుపల్లి చింతన తెలిపిన వివరాల ప్రకారం.. అమరచింత బీసీ కాలనీలో తాళం వేసి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి ఇవాళ మధ్యాహ్నం గద్వాల్ జిల్లా ఐజ మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి చొరబడి హుండీ పగలగొట్టి చోరీకి ప్రయత్నం చేశాడు.
ఈ విషయాన్ని పక్కింటి వారు గమనించి కాలనీవాసులతో కలిసి ఆ వ్యక్తిని పట్టుకొని అమరచింత పోలీసులకు అప్పగించగా కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి ఆ వ్యక్తి పోలీసుల కన్నుగప్పి పారిపోయినట్లుగా వెల్లడించారు.
ఈ విషయంపై అమరచింత ఎస్సై సురేష్ వివరణ కోరగా.. చోరీకి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భంగా స్టేషన్లో కూర్చోబెట్టామని.. తాము పనిలో ఉండగా ఇక్కడ నుంచి పరారయ్యాడని.. తమ సిబ్బందితో వెతికి పట్టుకుంటామని తెలిపారు. కాగా పురుషోత్తం అమరచింత శ్రీకృష్ణ నగర్లోని ఓ కుటుంబానికి అల్లుడు కావడం.. అతడు ఈ మధ్యకాలంలో మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉంచినట్టుగా స్థానికులు చెప్తున్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్