Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ మార్గదర్శకాలను పాటించకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ, విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-IV పంచాయతీ కార్యదర్శి పి.కిషన్, కొల్లాపూర్ మండలం పరిధిలోని సింగోటం గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి పి. అర్జునయ్య, అలాగే కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి ఆర్. ప్రేమచంద్లను విధుల నుండి సస్పెండ్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వంగూరు, కొల్లాపూర్ మండలాల పంచాయతీ అధికారులకు షోకాస్ నోటిసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

