పెద్దమందడి, మార్చి 30 : షార్ట్ సర్క్యూట్లో కిరాణా షాప్ షాపులో ఉన్న సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమయ్య పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన మంజులకు మూడు సంవత్సరాల క్రితం భర్త మృతి చెందగా ఆగ్ పిల్లల జీవనోపాధి కోసం కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.
ఎప్పటిలాగే ఆదివారం రోజు ఉదయం 11 గంటల వరకు షాపులో ఉండి టిఫిన్ చేసేందుకు కిరాణం డబ్బా మూసి ఇంటికి వెళ్లింది. కిరాణా డబ్బాలో నుంచి పొగలు రావడంతో సమాచారం అందుకున్న మంజుల డబ్బా తెరిచేలోపే లోపల ఉన్న సామాన్లు మొత్తం కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. షాపులో పండుగ కోసం తీసుకొచ్చిన సామగ్రి దాదాపు మూడు లక్షల వరకు ఉన్నట్లు బాధితురాలు, గ్రామస్తులు తెలిపారు. ఒంటరిగా జీవిస్తున్న మంజులను షాపు కాలిపోవడంతో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.