నాగర్ కర్నూలు : నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో కార్మిక లోకం మండిపడుతోంది.
ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా పరిష్కరించకుండా కార్మికులను పొట్టన పెట్టుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా డిపోల పరిధిలో శుక్రవారం రోడ్లపై మానవహారం, ఆందోళనలు చేపట్టారు. శుభకార్యాల సీజన్ కావడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.