కొల్లాపూర్, జనవరి 22 : డిమాండ్స్ డే సందర్భంగా గురువారం డిమాండ్స్ డే బ్యాడ్జీలు ధరించి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూ డిపో కార్యదర్శి మధుసూదన్ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికుల 2021, 2025 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్సీలను వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే రిటైర్డ్ కార్మికుల చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుత్ బస్సులను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూ రీజియన్ కార్యదర్శి వెంకటయ్య మరియు కార్మికులు పాల్గొన్నారు.