SLBC Tunnel | అచ్చంపేట, మార్చి 10 : దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ సిబ్బంది తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. SLBC టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
డిజాస్టర్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,సోమవారం SLBC టన్నెల్ ఆఫీసులో డిజాస్టర్ అండ్ మేనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కడావర్ డాగ్స్ స్క్వాడ్, సహాయక చర్యల్లో పాల్గొంటున్న విభాగాల అధికారులు హాజరయ్యారు.
వేగంగా ముగించాలని..
ఈ సమావేశంలో ఆదివారం జరిగిన సహాయక చర్యలను సమీక్షించి, పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు.
ఈ దుర్ఘటనలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారని తెలియజేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యల నిర్వహణ కోసం అవసరమైన అన్ని రకాల వనరులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
టన్నెల్ ప్రాంతానికి సహాయక బృందాలు సులభంగా చేరుకునేందుకు వాహన సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పని చేయడానికి అవసరమైన వసతుaiaiai అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులకు, సిబ్బందికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టన్నెల్ వద్ద సహాయక సిబ్బంది అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి