Indore Stadium | ఆత్మకూర్ జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభా పాటవాలు కలిగిన క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ఆత్మకూరు పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామని యువజన కాంగ్రెస్ నాయకులు తులసి రాజు యాదవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇవాళ ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూర్ మండల ప్రజల విజ్ఞప్తి మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరులో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొని గత వారం కిందట రాష్ట్ర క్రీడ సాధికారిక సంస్థ చైర్మన్ శివసేన రెడ్డిని కలిసి కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఈ రోజు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశం మేరకు హైదరాబాద్లో చైర్మన్ శివసేనారెడ్డిని కలిసి ఇండోర్ స్టేడియం ఏర్పాటుకై వినతిపత్రం అందజేశామని తులసిరాజు యాదవ్ వెల్లడించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా పరమేష్ నల్లగొండ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.