బిజినపల్లి,ఏప్రిల్ 10 : రూప్లాతండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మళ్లీ ప్రారంభించాలని బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెం డెంట్ శైలజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజినపల్లి మండలంలోని రూప్ల తండా ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులు చదువుకుంటుండగా మద్దెలోనే స్కూల్‌ను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
2024 జూలైలో శ్రీధర్ శర్మ అనే ఉపాధ్యాయుడు బదీలిపై వచ్చారని, అతడు వచ్చిన వెంటనే పిల్లలు రావడంలేదని ఆరోపిస్తూ పాఠశాలను మూసి వేస్తే పేదపిల్లలు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలను కొనసాగించాలని కోరారు.ఈ ప్రభుత్వం స్పందిస్తే రూప్ల తండా విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయం పట్ల వెంటనే స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బిఎస్ ఫ్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబు, మధు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.