కొల్లాపూర్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రభోత్సవం కన్నులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి ప్రభోత్సవం వైభంగా నిర్వహించారు.
అశేష భక్తజనం గోవింద నామస్మరణ చేస్తుండగా.. వేదమంత్రోచ్ఛరణలు.. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను సింహ వాహనంపై ఊరేగింపు చేపట్టారు. అంతకుముందు మహాస్నానాపనం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.