అచ్చంపేట రూరల్, జూన్ 17: అచ్చంపేట మండలంలోని సింగారం, ఎద్దుమిట్ట తండా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) పంచాయతీ కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రామనాథం మాట్లాడుతూ.. ఇండ్లు కట్టుకోలేని స్తోమత లేని గ్రామీణ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పథకం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట విజయ్ డెయిరీ అధ్యక్షులు దొడ్ల నర్సయ్య యాదవ్, సింగారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మంజుల, జగన్, హౌసింగ్ ఏఈ రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలోని లబ్ధిదారుల స్థలములలో ఇల్ల నిర్మాణానికి గాను ముగ్గులు పోయించారు.