TWJF | కొల్లాపూర్, జూన్ 25 : కొల్లాపూర్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తాటికొండ కృష్ణ పరిపూర్ణం రామచందర్, జలకం మద్దిలేటి, సీనియర్ జర్నలిస్టులు కురుమయ్య, సీపీ నాయుడు, రమణలు అన్నారు. కొల్లాపూర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను ఆ సంఘ నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్ కూడా వచ్చిందన్నారు. కానీ జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ చైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, కాటం జంబులయ్య, కట్ట శ్రీనివాసులు సురేందర్ రావు, నరేంద్రలు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కలెక్టర్‌తో మాట్లాడి ప్రొసీడింగ్స్ కూడా ..
దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ రోజు జర్నలిస్టులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నారు. తెలంగాణ తెచ్చిన విలేకరులకు కచ్చితంగా ఇండ్లు స్థలాలు ఉండాలన్నారు. మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విలేకరులకు సంబంధించి ఇండ్ల స్థలాల ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సొంతంగా ఐదు లక్షల దాకా ఖర్చు చేసి ఎంతో విలువైన స్థలాలను విలేకరులకు ఇచ్చేందుకు కలెక్టర్‌తో మాట్లాడి ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని వచ్చారు. భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు.
బీజేపీ టౌన్ అధ్యక్షుడు కాడం శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీజేపీ పట్టణ శాఖ నుంచి జర్నలిస్టులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మా పార్టీ తరుపు నుంచి జర్నలిస్టులకు మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం అన్నది నాలుగో స్తంభం.. ఎక్కడ ఏ విధమైనటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా అది కేవలం ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సామాజిక సేవకు వాళ్లకి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా తగిన గౌరవం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు. ఆశించకుండా వాళ్లు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవకు ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు డిమాండ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
సామాజిక సేవలో ముందున్నటువంటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పెంట్లవెల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా పార్టీ తరపున మద్దతు ఉంటాం ఎప్పుడు కూడా మా మండలం మా పెంట్లవెల్లి మండలం తరఫునుంచి రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇస్తామన్నారు. పెంట్లవెల్లి మండల బీఆర్ఎస్ నాయకులు రాజేష్ , మాజీ కోఆప్షన్ సభ్యులు మతీన్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలెం సుధాకర్ నాయుడు, సీనియర్ నాయకులు సుధాకర్, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు తమటం సాయి కృష్ణగౌడ్, ఏబీవీపీ నాయకులు భరత్ యాదవ్, టీడీపీ మండల అధ్యక్షుడు బరిగెల సత్యనారాయణ పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ