Kollapur | కొల్లాపూర్ ఫిబ్రవరి 10 : కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాద భరితంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. దీనికి తోడు పట్టణంలోని మైనార్టీ గురుకులం సమీపంలో మ్యాన్ హోల్ నుంచి గత కొద్ది నెలలుగా నీళ్లు బయటకు వచ్చి ప్రధాన రోడ్డుపై పారుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.
కొల్లాపూర్ నుంచి పెబ్బేరు 50 కిలోమీటర్లు ఉంటుంది. కానీ కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు చేరుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఈ ప్రధాన రోడ్డు వెంట స్పీడ్ బ్రేకులతోపాటు గుంతల రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొల్లాపూర్-పెబ్బేరు ప్రధాన రోడ్డు వెంట మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్