నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష్య, కార్యదర్శులు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఇటీవల నూతనం గా ఎంపికైన ఐదు మండలాల, మున్సిపల్ అధ్యక్ష్య, కార్యదర్శులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష్య, కార్యదర్శులు గ్రామాల్లో విధిగా పర్యటించి ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను తెలియజేయాలన్నారు. ఈక్రమంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత, అంతకు ముందు పరిస్థితులను, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కార్య కర్తలే పార్టీ బలోపేతానికి పట్టుకొమ్మలుగా నిలువాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, అన్ని మండలాల, మున్సిపల్ అధ్యక్ష్య, కార్యదర్శులు పాల్గొన్నారు.