తిమ్మాజీపేట/అమరచింత, ఏప్రిల్ 03: నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేశారు. తిమ్మాజీపేటతోపాటు గొరిటలో బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేదలు కూడా నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే ప్రతి తెల్ల రేషన్‌కార్డు దారునికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఆర్డిఓ సురేశ్, తాసిల్దార్ రామకృష్ణయ్య, ఆర్ఐ రవిచంద్ర, నాయకులు వెంకట్రాంరెడ్డి, దానం బాలరాజ్, మల్లయ్య గౌడ్, ముబారక్, నాగ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
పిన్నంచర్లలో..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీని ఆత్మకూరు మండలంలోని పిన్నంచెర్లలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిమతుల్లా, మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్ ప్రారంభించారు. పేద ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిన్నం చర్ల మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, యువజన కాంగ్రెస్ నాయకులు మచ్చెందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాములు, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.