అచ్చంపేట, జూన్ 27 : ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రజావాణి ఉపయోగపడుతుందని అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్ అన్నారు. సోమవారం అచ్చంపేట రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అచ్చంపేట డివిజన్లోని ప్రతి మండలంలో ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజావాణిలో మండలంలోని అన్ని శాఖల ప్రధాన అధికారులు పాల్గొంటారని ఆయా మండలాల ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, ఏవో కృష్ణయ్య, ఎక్సైజ్ ఎస్సై సతీశ్, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి
కొల్లాపూర్‌రూరల్, జూన్ 27 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని చేసుకున్న దరఖాస్తులకు తక్షణం పరిష్కారం చూపేదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆర్డీవో హనుమానాయక్ సూచించారు. సోమవారం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి మండల కేం ద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తే వాటిని పెండింగ్ పెట్టడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ రమేశ్‌నాయక్, ఆయా శాఖల అధికారులు నాగశేషు, జంగమ్మ పాల్గొన్నారు.
ఉప్పునుంతలలో..
ఉప్పునుంతల, జూన్ 27 : స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని తా సిల్దార్ శైలేంద్రకుమార్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని ప్ర వేశపెట్టడం జరిగిందని, మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో ఏవో సునీత, ఏపీఎం సైదులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
బల్మూరులో..
బల్మూరు, జూన్ 27 : ప్రజాసమస్యల పరిష్కరానికి ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుందని తాసిల్దార్ కిష్ట్యానాయక్ అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలుంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే వెంటనే అధికారులతో కలిసి పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏవో మహేశ్, ఎంపీ ఎం చిట్టెమ్మ, ఆయా శాఖఅధికారులు పాల్గొన్నారు.