ఉప్పునుంతల, ఫిబ్రవరి 22 : గ్రామాల్లో ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించి వాటిని జాతీయ ఉపాధిహా మీ పథకం కింద చేయించాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో జాతీయ ఉపాధిహామీ పనులపై అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ కూలీల పనిదినాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధిహామీ పని దినాలు పెంచకపోతే పంచాయతీల కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 9,927 జాబ్ కార్డులుండగా కేవలం 4,301 జాబ్ కార్డులకు మాత్రమే పని కల్పించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు టీఏలతో కలసి క్రమం తప్పకుం డా ప్రతి 15 రోజులకొకేసారి శ్రమ శక్తి కమిటీ మేట్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఉపాధిహామీ ద్వా రా గ్రామాభివృద్ధికి అవసరమైన 400 పనులు చేపట్టవచ్చని, ఈ విషయం ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం తో చాలా మంది పనులు చేయుటకు ముందుకు వస్తారన్నా రు. ఉపాధి కూలీలను పెంచి వంద శాతం పనులు నిర్వహిం చాలని సూచించారు. కూలీలు రావడం లేదని కుంటి సాకులు చెప్పవద్దన్నారు. చేసిన పనికి సకాలంలో ఎఫ్‌టీవోలు జనరేట్ చేసి డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేవిధంగా చేసి ఉపాధిహా మీ కూలీలకు నమ్మకం కల్పించాలని సూచించారు. ఎంపీడీ వో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాల్లో పనులు వేగంగా జరిగే లా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం 9 గంటల లోగా పనులు జరుగుతున్న సైటుకు వెళ్లి ఫొటోతో డిజిటల్ సంతకం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నర్సింగ్‌రావు, ఎంపీడీవో లక్ష్మణ్‌రావు, ఏపీవో సుదర్శన్‌గౌడ్, ఎంపీవో వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.
అచ్చంపేటలో..
అచ్చంపేటటౌన్/రూరల్, ఫిబ్రవరి 22 : రక్తహీనత, పోషక లోపంలేని జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ పీ.ఉదయ్‌కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలు, ఏఎన్ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. దాదాపు పది వేల మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని వారిని ఆరోగ్య వంతులుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు.సమావేశంలో డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, సంక్షేమ అధికారి వెంకట్‌లక్ష్మి, అచ్చంపేట ఆర్డీవో పాండూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సురేశ్‌బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ఆర్బీసీ మెడికల్ ఆఫీసర్లు శోభ, సురేశ్, సీడీపీవో దమయంతి పాల్గొన్నారు.