10th class exams | పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఇలాంటి అసౌకర్యం కలిగించకుండా తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. ఇవాళ కల్వకుర్తి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కల్వకుర్తి ఎంఈఓ శంకర్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోని గదులలో వెంటిలేషన్, బెంచీలు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు పరీక్షలు రాయడానికి వచ్చే ముందు విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల బయట నోటీస్ బోర్డుపై హాల్ టికెట్ నెంబర్లు కేటాయించిన తరగతులు గదులు కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలన్నారు.
ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ముందుగానే వచ్చే విధంగా సీఎస్‌లు జాగ్రత్త తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని తరగతి గదిలో వెంటిలేషన్ లైటింగ్ త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల హెచ్ఎంలు తదితరులు ఉన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు