జడ్చర్ల, జూన్ 9 : ఈజీఎస్ పథకంలో చేపడుతున్న పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో స్వరూప కూలీలకు సూచించారు. బుధవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, కిష్టారం, ఖానాపూర్ గ్రామాలలో ఎంపీడీవో పర్యటించి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పోలేపల్లి, కిష్టారం గ్రా మాల్లో ఈజీఎస్లో చేపట్టిన ల్యాండ్ లెవలింగ్ పనులను ఆమె పరిశీలించారు. ఖానాపూర్ గ్రామంలో పల్లెప్రకృతివనం, క్రిమిటోరియం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈజీఎస్లో 100రోజుల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు రూ.245 వస్తాయని పనులకు రావాలని సూచించారు. ఎక్కువమంది కూలీలు పనులకువచ్చేలా పంచాయతీ కార్యదర్శులు చూడాలని ఆమె తెలిపారు. పల్లెప్రకృతివనం, క్రిమిటోరియం, సెగ్రిగేషన్షెడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయించాలని సూచించారు. నర్సరీలలో కలుపులేకుండా చూడాలని సూచించారు.