అచ్చంపేట రూరల్, జూన్ 2: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ అభివృద్ధ్ది ఫలాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో ్ద మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, వ్యవసాయ మార్కెట్లో, తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద మార్కెట్ చైర్మన్ సీఎం రెడ్డి, సింగిల్‌విండో కార్యాలయం వద్ద చైర్మన్ రాజీరెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ శాంతాభాయి, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ చంద్రశేఖర్, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో పాండు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ ప్రాముఖ్యత, సాధించిన ఫలితాలను గుర్తు చేశారు. అనంతరం నీడ్స్బాబా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు మాస్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శైలజ, మాజీ చైర్మన్ తులసీరాం, మార్కెట్ వైస్ చైర్మన్ గోపాల్‌నాయక్, కమిషనర్ శ్రీహరి రాజు, ఏఈ మేఘనాథ్, పర్యావరణ ఇంజినీర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు రమేశ్‌రావు, శివ, సోమ్లా, రమేశ్, మనోహర్‌ప్రసాద్, శ్రీను, సునీత, ఖాజాబీ, మెహ్రన్బేగం నాయకులు నిజాం, ఖలీల్ తదితరులు ఉన్నారు.
లింగాల మండలంలో..
లింగాల, జూన్ 2:లింగాల, బల్మూర్ మండలాల్లో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలీస్‌స్టేషన్, తాసిల్దార్, మండల పరిషత్, సింగిల్ విండో, గ్రామపంచాయతీ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సై కృష్ణయ్య, ఎంపీపీ లింగమ్మ, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్‌రెడ్డి, తాసిల్దార్ మునిరోద్దిన్, ఎంపీడీవో గీతాంజలి, మండల వ్యవసాయాధికారి నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రానోజీ, మాజీ జెడ్పీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, హెచ్ఎం శేఖర్ పాల్గొన్నారు.
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, జూన్ 2: సింగిల్‌విండో కార్యాలయం వద్ద చైర్మన్ భూపాల్‌రావు, పాలకేంద్రం వద్ద చైర్మన్ గోపాల్‌రెడ్డి, వివిధ కార్యాలయాల వద్ద ఆయా అధికారులు జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మండలంలోని తాడూర్‌లో గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ అలివేల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యామలీల, ఉపసర్పంచ్ శిరీష, పంచాయతీ కార్యదర్శి తులసీరాం, కృష్ణయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అమ్రాబాద్, పదర మండలాల్లో..
అమ్రాబాద్, జూన్ 2: అమ్రాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకటయ్య, పోలీస్‌స్టేషన్‌లో సీఐ బీసన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఉపాధ్యాయులు, అధికారులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పదర మండలంలో అధికారులు, వివిధ గ్రామాల్లో పార్టీనేతలు ఆవిర్భావ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ ప్రణీత, సిబ్బంది రాజు, శ్రీనివాసులు, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
అమవీరుల స్థూపం, తెలంగాణ తల్లికి నివాళి
కొల్లాపూర్, జూన్ 2: క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలోనూ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పట్టణంలో జూపల్లి క్యాంపు కార్యాలయంలో జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. వంగ రాజశేఖర్‌గౌడ్ సహకారంతో కౌన్సిలర్లు కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ భోజ్యనాయక్, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో హనుమానాయక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ షౌకద్అలీ, సివిల్ దవాఖాలో డాక్టర్ భరత్రావు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ నరేందర్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు.
కొల్లాపూర్ మండలంలో..
కొల్లాపూర్ రూరల్, జూన్ 2: కొల్లాపూర్ మండలంలో ప్రతి గ్రామపంచాయతీ భవనం ఆవరణలో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యదర్శులులతోపాటు గ్రామంలో పార్టీలకతీతంగా అందరూ నాయకులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సింగోటంలో కృష్ణయ్య, అంకిరావుపల్లిలో వెంకటస్వామి, మాచినేనిపల్లిలో సుజాత సురేందర్, జావాయిపల్లిలో గాయత్రీ, యనమెట్లలో నాగరాజు, సోమశీలలో మద్దిలేటి, నార్లాపూర్‌లో చిట్టెమ్మ, మొలచింతపల్లిలో కొమ్మరాజు, ముక్కిడిగుండంలో దశరథం, కుడికిళ్లలో రాధ జెండాలు ఆవిష్కరించారు.
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
కోడేరు, జూన్ 2: మండలంలో ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీడీవో శంకర్‌నాయక్, పోలీసుస్టేషన్‌పై ఎస్సై కృష్ణఓబుల్‌రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయంపై సర్పంచ్ వెంకటస్వామి, ఎమ్మార్సీపై ఎంఐఎస్ బంగారయ్య, బీసీ హాస్టల్‌వద్ద సీహెచ్ శ్రీనువాసులు, విండో కార్యాలయంపై చైర్మన్ చిన్నారెడ్డి, బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మాజీమంత్రి జూపల్లి వర్గీయులు నాగశేషయ్య, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు మేస్త్రీ కురుమయ్య, పశువైద్యశాల వద్ద డాక్టర్ భానుకిరణ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు బస్టాండ్ కూడలిలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మలిదశ ఉద్యమ కారుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, జూన్ 2: మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు పంచాయతీ భవనాల దగ్గర జాతీయ జెండాలను ఎగురవేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో ప్రతాప్‌గౌడ్, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాసాచారి, పోలీసుస్టేషన్ వద్ద ఎస్సై నాగన్న జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, జెడ్పీటీసీ గౌరమ్మ, ఎంపీటీసీలు రేణుక, శశికళ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఈగలపెంట హరిత హోటల్లో..
శ్రీశైలం, జూన్ 2: ఈగలపెంట హరిత హోటల్లో వేడుకలు నిర్వహించినట్లు టీఎస్ టూరిజం నాగర్‌కర్నూల్ జిల్లా యూనిట్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం హోటల్ ఫ్రంట్ ఆఫీస్ వద్ద జెండా ఎగురవేసి రాష్ట్ర సాధనకు అమరులైన వారికి జోహార్లు అర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో సిబ్బంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.