గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
అచ్చంపేట, ఫిబ్రవరి 10: నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం, గ్రామంలో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంతకుముందు మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొల్గరా గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక సాయం
Arthika Sahayam
కొల్లాపూర్, ఫిబ్రవరి 10: మండల పరిధిలోని యన్మన్ బెట్ల గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వివిధ కుటుంబాలను సోమవారం అలంపూర్ సురేందర్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు రాముడు అనారోగ్య సమస్యలతో ఇటీవల సర్జరీ చేయించున్నారు. అలాగే సదుర్ల పద్మమ్మ కాలు ఫ్యాక్చర్ అయి సర్జరీ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు సురేందర్ రావు బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు రూ. పదివేల ఆర్థిక సాయం అందజేశారు. గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోళ్ల సాయికుమార్,పెద్ద వెంకటయ్య,పాశం రామకృష్ణ,బజార్ గాలయ్య,సత్యనారాయణ,ఆటో రాముడు,పెద్ద రాముడు,మల్లయ్య రాముడు,బోరింగ్ రాముడు, బాలస్వామి, కుర్వ ఎల్లయ్య,బోయ బాలకృష్ణ, హైదరాలి, తూఫాన్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు రగ్గులు పంపిణీ
Raggulu
అచ్చంపేట, ఫిబ్రవరి 10: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని రాయవరం గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లంగోండ్ల రాజు గ్రామస్తులకు రగ్గులు పంపిణీ చేశారు. అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు సన్మానం చేసి రగ్గులు పంపిణీ చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ వాసిగా గ్రామస్తులకు తన వంతు సహకారం, చేయూత అందించాలని ఉద్దేశంతో గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు రాజు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు సీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.
గిరిజన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
Girijana Family
అచ్చంపేట, ఫిబ్రవరి 10: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో గిరిజన కుటుంబానికి లింగాల బంజారా సేవా సమితి ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. గ్రామానికి చెందిన జరుపుల గోమ్లిబాయ్ మృతిచెందగా మృతురాల కుటుంబానికి గ్రామస్తులు రూ: 10000 వెలు ఆర్థిక సాయం చేశారు. గ్రామంలోని విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు దాదాపు 40 మంది వరకు నెలకు రూపాయలు 500 చొప్పున కేటాయించి గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద, సమస్య వచ్చిన ఆదుకోవడానికి చేయూత అందిస్తున్నారు. పుట్టి పెరిగిన గ్రామానికి కొంతమేర ఆదుకోవాలని ఉద్దేశంతో నిధులు పోగుచేస్తూ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. కార్యక్రమంలో స్థా నిక గిరిజన నాయకులు బాలాజీ, శంకర్రాథోడ్, శంకర్ నాయక్, రాములు, సీతారాం, కిషన్, లక్ష్మణ్, మోతీరాం, లచ్చు, రాంజీ, సూర్య, శివ, మురళి తదితరులు పాల్గొన్నారు.