కొల్లాపూర్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఈ నెల 13 వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు( Muggle competitions) నిర్వస్తామని ఆదివారం రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ తెలిపారు. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి,యువతకు సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యవంతం చేస్తున్న ఈ తరుణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోగలరని పిలుపునిచ్చారు.
పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.30,116 రెండవ బహుమతిగా రూ.20,116 మూడవ బహుమతిగా రూ.15,116 నాలుగవ బహుమతిగా రూ.10,116 ఐదవ బహుమతిగా రూ.5,116 ఇవ్వడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనే వారు కొల్లాపూర్ ప్రాంతం వారై ఉండాలి తప్పని సరిగా ఆధార్ తీసుకురావాలన్నారు. ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ఆసక్తిగల వారు రత్నగిరి ఫౌండేషన్ కార్యాలయంలో రిజిస్టేషన్ చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ కింది నెంబర్లను 6300141297,8309672607 సంప్రదించాలని సూచించారు.