వెల్దండ జూన్ 23 : అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్, వెల్దండ గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయని ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు.
రాష్ట్రంలో పేదలందరికి సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, నాయకులు భూపతి రెడ్డి, మట్ట వెంకటయ్య గౌడ్, సంజీవ్ కుమార్, వెంకట్ రెడ్డి, హరికిషన్, కేశమల్ల కృష్ణ, జర్పుల శ్రీను, రషీద్, జక్కుల శ్రీను యాదవ్ తదితరులు ఉన్నారు.