MLA Megha reddy | పెద్దమందడి, మార్చు 16: పెద్దమందడి మండలం చిల్కటోన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు జానకిరాములు భార్య పద్మ గత వారం రోజుల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి.. ఆ వెంటనే పద్మ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ చిల్కటోన్ పల్లి గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం అల్వాల గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయిన బాధితురాలిని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అదే విధంగా గుండెపోటుతో మృతి చెందిన భీమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, బాలచంద్రయ్య, డీలర్ శ్రీనివాసులు, శాఖ వెంకటయ్య, సీ వెంకటేష్, మణిగిల్ల తిరుపతిరెడ్డి, బాబురెడ్డి రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు