వెల్దండ ఏప్రిల్ 28 : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో శ్రీ గుండాల అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆలయ నిర్వాహకులు సోమవారం ఆహ్వానించారు. వెల్దండ మండల కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేను వారు కలిశారు. ఈనెల 30న నిర్వహించే ఆలయ ముఖద్వారా ప్రవేశ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రావాలని ఎమ్మెల్యేను కోరారు.
అదేవిధంగా ఎంపీ మల్లు రవి పాల్గొననున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, సంజీవ్ కుమార్ లను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖద్వార నిర్మాణ దాత రామస్వామి గౌడ్, అర్చకులు సంతోష్ , శివకుమార్, సురేష్ తదితరులు ఉన్నారు.