నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ మాజీ సర్పంచ్ వంగా శరత్ బాబుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర డెంటల్ అసోసియేషన్ చైర్మన్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి నివాళులు అర్పించారు. శంషాబాద్‌లోని మేఫైర్ కన్వెన్షన్‌లో దివంగత నేత శరత్ బాబు గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థించారు.