అచ్చంపేట రూరల్: జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు. మన నైతిక విలువలు కాపాడుకోవడంతోపాటు పారదర్శకతతో కూడిన వార్తలను ప్రచురించినప్పుడు ప్రజల్లో మనపై గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని అటవీ శాఖ వనమాలిక ఆవరణలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పాత్రికేయులకు వివిధ అంశాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్‌రెడ్డి ‘నైతిక నియమాలు, మీడియా- చట్టాలు’ అనే అంశంపై మాట్లాడుతూ.. మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు పాత్రికేయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఈ శిక్షణలో పాత్రికేయులు దాదాపుగా నూటికి 90 శాతం మంది ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉండడం సంతోషకరమన్నారు. త్వరలోనే పాత్రికేయులకు హైదరాబాద్‌లో వారం రోజులపాటు మీడియా అకాడమీ ద్వారా కంప్యూటర్ శిక్షణ నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నామని, అది కంప్యూటర్‌పై అవగాహన లేని వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పత్రికలు మొన్నటి వరకు స్వాతంత్రం కోసం పనిచేశాయని నేడు స్వతంత్ర దేశంలో పత్రికలు పెట్టుబడిదారీ విధానం అమలుపరుస్తూన్నాయని, జర్నలిస్టుల సంక్షేమం కోసం 1952లో మీడియా చట్టం వచ్చిందని వర్కింగ్ జర్నలిస్టులో హక్కుల కోసం ఫ్రెండ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1995లో తీసుకొచ్చిందని, ఐదు రకాల వేతన చట్టాలు వచ్చిన అమలు విషయంలో జాప్యాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసిన అంశాలను క్రోడీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలని ప్రెస్ కౌన్సిల్ సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా కాలయాపన చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కార్మిక చట్టాలకు కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేస్తే అందులో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టి కూడా ఉందని గుర్తుచేశారు. ఇలా కాలయాపన చేయడం అన్ని కార్మిక చట్టాలకు చాలా ప్రమాదమన్నారు.
జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించకపోతే, జర్నలిస్టులు నైతిక ప్రమాణం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని మన నైతిక విలువలు కాపాడుకోవడంతోపాటు పారదర్శకతతో కూడిన వార్తలను పరిచరించినప్పుడు ప్రజల్లో మనపై గౌరవం పెరుగుతుందన్నారు. కావున ప్రతి రిపోర్టరు వార్తల విశ్వసనీయతపై దృష్టి కేంద్రీకరించాలని, కనీస ధర్మం తప్పక పాటించినప్పుడే మరింత గౌరవం పెరుగుతుందన్నారు.
నేటి తరంలో పాత్రికేయులు, రాజకీయ నాయకులు, పోలీసుల నుంచి విలేకరులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుందని ఇది మంచి పద్ధతి కాదన్నారు. అందుకు కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ అలాంటి వాతావరణం ఉండకూడదని, పాత్రికేయులపై ఎక్కడ చిన్న దాడి జరిగినా హక్కుల కోసం పోరాటం చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకో గలమని వివరించారు. ఏ పత్రికలో అయినా యజమాని ఉద్యోగి సంబంధాలు ఉంటాయో అతడే జర్నలిస్టని, అతడు పార్ట్ టైం, ఫుల్ టైం అనే అంశం కారణం కాదన్నారు. ఈ సమావేశంలో అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎడిటర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తోట భావనారాయణ, జిల్లా పాత్రికేయులు సుమారు 80 మంది పాల్గొన్నారు.