తాడూర్ జూన్ 17 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంత కోడూరు గ్రామానికి చెందిన లింగం గౌడ్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాడూర్ ఎస్ఐ గురు స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లింగం గౌడ్ మృతితో గుంత కోడూరులో విషాదయఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.