జడ్చర్ల, ఏప్రిల్ 8 : యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై శుక్రవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. గ్రామగ్రామానా రైతులు తమ ఇండ్ల పై నల్లజెండాలను ఎగురవేసి కేంద్రం తీరు ను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మండలంలోని గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. పట్టణంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేం ద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమాలలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, సర్పంచులు మమతానవీన్రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసులు, ముడా డైరెక్టర్ ఇంతియాజ్‌ఖాన్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, దేవా, రఘురాంగౌ డ్, నాయకులు రఘుపతిరెడ్డి, దామోదర్, కొండల్, పర్వత్‌రెడ్డి, శ్రీనునాయక్, శివకుమార్, సత్యం, నాగిరెడ్డి, విజయ్, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నవీన్‌రెడ్డి,రాంచంద్రయ్య, వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, ఏప్రిల్ 8 : మండలంలోని కోడూర్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వగౌడ్ నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. కేం ద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అప్పాయిపల్లి, కోటకదిర, ఓబ్లాయిపల్లి గ్రా మాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, చిన్నవెంకటయ్య, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్, రమ్య, చంద్రకళ, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఎంపీటీ సీ మస్తాన్, రాఘవేందర్‌గౌడ్, పాండురంగారె డ్డి, లక్ష్మయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఏప్రిల్ 8 : వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబించడంపై రైతులు నల్లజెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, నారాయణగౌడ్, గోవర్ధన్, భీమయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఏప్రిల్ 8 : కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండలకేంద్రంతోపాటు గుండేడ్, నేరళ్లపల్లి, ఉడిత్యాల, నందారం, మోతీఘనపూర్, పెద్దాయపల్లి, చింతకుంటతండా గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
బాలానగర్(రాజాపూర్), ఏప్రిల్ 8 : యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా మండలంలోని తిర్మలాపూర్ తదితర గ్రా మాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, ఎంపీపీ సుశీల, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రామకృష్ణాగౌడ్, తాహెర్పాషా, పుల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌నాయక్, రమేశ్నాయ క్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఏప్రిల్ 8 : వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ శశిరేఖ, మాజీ జెడ్పీటీసీ హై మావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బాలు, జంగిరెడ్డి, నారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి, సుదర్శన్, వెంకట్‌రెడ్డి, శేఖర్, మల్లయ్య, శ్రీనివాసులు, భద్రయ్య, జగన్‌గౌడ్, గోపాల్, రామకృష్ణ, వెంకట్, బాబా, భీంరాజు, బంగారు, నవీనాచారి, ఆంజనేయులు, రాజు, కుమార్, రమేశ్, వీరేశ్, రా జమల్లయ్య, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, ఏప్రిల్ 8 : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజుయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు.
మూసాపేట, అడ్డాకుల మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 8 : తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గ్రామాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలను ఎగురవేశారు. అలాగే కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు జితేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఏప్రిల్ 8 : టీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు, రైతులు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతు లు తమ ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, సర్పంచులు బొజ్జమ్మాయాదయ్య, లలితమ్మ, జంగయ్య, లతాశ్రీనివాస్రెడ్డి, పాశం జంగ మ్మ, వెంకటేశ్, సత్యం, లక్ష్మారెడ్డి, కృష్ణ య్య, ఎంపీటీసీలు గోపాల్, రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ శీనయ్య, మెండె లక్ష్మయ్య, కృష్ణగౌడ్, చందర్‌నాయక్, రఘు, వెంకటేశ్వర్‌రెడ్డి, భోజయ్యాచారి, దేపల్లి రాములు, అబ్దుల్‌అలీ, శంకర్‌నాయక్, మెండె శ్రీను, సంజీవరెడ్డి, మాన్యానాయక్, గవీండ్ల శంక ర్, నర్సింహులు, ప్రకాశ్ పాల్గొన్నారు.
నిరసన సెగ ఢిల్లీకి తాకాలి
గండీడ్, ఏప్రిల్ 8 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం చేపట్టిన నిరసనల సెగ ఢిల్లీకి తాకాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అ న్నారు. మండలకేంద్రంలో శుక్రవారం రైతు ఇంటిపై నల్లజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి గండీడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, రాంచంద్రారెడ్డి, రాంచంద్ర య్య, రమేశ్‌రెడ్డి. బాలవర్ధన్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతుకు అన్యాయం
భూత్పూర్, ఏప్రిల్ 8 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై కుటి ల రాజకీయం చేస్తూ రైతుకు అన్యాయం చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం మండలంలోని అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే తన ఇంటిపై నల్లజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, కేంద్రం వడ్లను కొనేదాక పోరాటం ఆగదన్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రా మాల్లో టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, నాయకులు సత్తూర్ నారాయణగౌ డ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రాములు, సత్యనారాయణ, సాయిలు పాల్గొన్నారు.