వెల్దండ, ఏప్రిల్ 28: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. సోమవారం ఉదయం వెల్దండలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్, ఆమనగల్లో 50 పడకల ఆసుపత్రి మంజూరు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా వెల్దండలో 30 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. హాస్పిటల్లో సరిపడా వైద్యులను, సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్తీక్ కుమార్, డీటీ కిరణ్ కుమార్, పీబీసీ మెంబర్ బాలాజీసింగ్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, సంజీవ్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ రాజశేఖర్ , కృష్ణ, రమాకాంత్ రెడ్డి , సురేందర్ రెడ్డి, ఎర్ర శీను, పుల్లయ్య, రషీద్, కృష్ణ ముదిరాజ్, శ్రీను యాదవ్ , రమేష్ గౌడ్ ఉన్నారు.