మరికల్, మే 13: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా జల్దీ వింధ్య సేవ ప్రత్యేక పూజలు పల్లకి సేవ నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని పటాకులు కాలుస్తూ భాజ భజంత్రీలతో గ్రామంలో ఊరేగించారు.
అఖండ భజన కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు రథోత్సవాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించిన బ్రహ్మత్సవాల్లో భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. మంగళవారం ఈశ్వర ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజ అలంకరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.