అచ్చంపేట : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ అన్నారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రదాడిని పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఉగ్రదాడులను తిప్పికొట్టాలని, చనిపోయిన 27 మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలువాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఐఎన్టీయూసీ టౌన్ ఉపాధ్యక్షులు మౌలానా, తాలూకా కార్యదర్శి ఉస్మాన్, సహాయ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.