పెద్దమందడి, మార్చి 27 : మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గురువారం మొసలిని బంధించారు. చేపలవేటకు వెళ్లి మత్స్యకారులకు మొసలి కనిపించడంతో భయాందోళనకు గురై వెంటనే మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు వాకిటి నరేశ్కుమార్కు సమాచారం ఇచ్చారు. ఆయన వనపర్తిలోని స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు చీర్ల కృష్ణసాగర్కు సమాచారమిచ్చారు.
ఆయన అక్కడికి చేరుకొని పెద్ద చెరువు ఒడ్డుపైన పడుకొని ఉన్న ఏడు ఫీట్ల పొడవు, 80 కేజీల బరువు ఉన్న మొసలిని బంధించి గ్రామంలోకి తీసుకువచ్చారు. అనంతరం బంధించిన మొసలిని బొలేరోలో తీసుకెళ్లి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి ఎస్ఐ యుగంధర్ రెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేష్ కుమార్, విజయ్ రాజు, సింగల్ విండో డైరెక్టర్ నరేష్, రాధాకృష్ణ, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.