నాగర్కర్నూల్ : విద్యుత్ షాక్తో మరణించిన విద్యార్థి లోకేష్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని ఇంద్రకల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మల్లేష్ కుమారుడు లోకేష్ (14) ఉదయం ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం దగ్గర వైర్ తగిలి అక్కడికక్కడే మరణించాడు.
విషయం తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో బాబు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శోక సంద్రంలో మునిగిపోయిన బాలుడి కుటుంబాన్ని ఓదార్చారు. చిన్న వయస్సులో కుమారుడు అకాల మరణం సంభవించడం చాలా బాధాకరమని అన్నారు. అ భగవంతుడు అ కుటుంబానికి మనో ధైర్యం కల్పించాలని ప్రార్థించారు. వారి వెంటే పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.