అచ్చంపేట : సింగారం గ్రామంలో ఎర్రజెండా ఎగిరినప్పుడు అంతయ్యకు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్ అన్నారు. అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో అంతయ్య వర్ధంతిని మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్యా నాయక్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా పేదలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందన్నారు. అచ్చంపేట ప్రాంతంలో అంతయ్య నిజాయితీగా కమ్యూనిస్టు పార్టీ పెరుగుదల కోసం కృషి చేశారన్నారు. కొందరు పార్టీ ఎదుగుదలను ఓర్వలేక తుపాకులతో కాల్చి చంపారని, వ్యక్తిని చంపినంత మాత్రాన వారి ఆశయాలు ఆగవని వారి ఆశయాల కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నిరంతరం పనిచేస్తారని గుర్తు చేశారు.
ఈ దేశంలో నిరుద్యోగ వ్యవస్థను పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. వాటికి వ్యతిరేకంగా జనంలో తీసుకెళ్లి ప్రజా పోరాటాలను నిర్వహించే దాంట్లో కమ్యూనిస్టు పార్టీ ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్, నిర్మల, శివ కుమార్, పర్వతాలు, మండల కార్యదర్శి సైదులు, మాజీ సర్పంచ్ లు కొండేమోని బాలింగయ్య, జరుపుల చంద్రు నాయక్, గ్రామ కార్యదర్శి బక్కయ్య నాయకులు చిన్న అంజనేయులు, సాటు వెంకటయ్య, శేఖర్ అంతయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.