ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజాభిప్రాయ సేకరణ | పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటుపై పర్యావరణ అనుమతుల విషయంలోరాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ తెలిపారు.

వెల్దండ/నాగర్‌కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటుపై పర్యావరణ అనుమతుల విషయంలోరాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ తెలిపారు. మంగళవారం ఉదయం ఏవీఆర్ ఫంక్షన్ హాల్ వెల్దండలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఎనిమిది మండలాల నుంచి రైతులు వచ్చి ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో పర్యావరణానికి సంబంధించిన తమ అభిప్రాయాలను తెలియజేసారు. రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వెలుబుచ్చిన వారి అభిప్రాయాల వీడియోలు రికార్డింగ్ చేశామననారు. వీటితో పాటు కొందరు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వారి అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
అంతకన్నా ముందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, ప్రజలకు కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీరు డి. సంగీత లక్ష్మి ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండో ఫేజ్ కెనాల్ ఏర్పాటు ఆవశ్యకత, అందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా లాభాలు, ప్రాజెక్ట్ ఏర్పాటు వళ్ల ఏర్పడే పర్యావరణ నష్టం తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ పై తెలుగులో, ఆంగ్లంలో పూర్తి వివరాలు గణాంకాలతో సహా వివరించారు. కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ డి. కృపానంద్, ఎస్ఈఈ జి.హన్మంత్ రెడ్డి, ఏఈఈ డి.సంగీత లక్ష్మి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : దమ్మన్నపేటలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్‌ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

