OBC Bill: కోటాపై సీలింగ్‌ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఇవాళ రాజ్యాంగ సవరణ ( OBC Bill) బిల్లుపై చర్చ జరిగింది. స్పీకర్ ఓం బిర్లా కోరిక మేరకు విపక్ష సభ్యులు సభలో నినాదాలు ఆపేశారు. దీంతో ఆ బిల్లుపై చర్చ మొదలుపెట్టారు. మంత్రి వీరేంద్ర కుమార్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఓబీసీ జాబితా తయారు చేసేందుకు రాష్ట్రాలకే అధికారం ఇచ్చే రీతిలో ఓబీసీ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ సవరణ బిల్లు వల్ల దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో సుమారు 4వేల మంది ఓబీసీలకు సీట్లు దక్కనున్నాయి.
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ఈ నేపథ్యంలో లోక్‌సభలో మాట్లాడుతూ.. ఇది కీలకమైన బిల్లు కాబట్టే తాము చర్చలో పాల్గొంటున్నామన్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటూ మూడవ వంత సభ్యులు కూడా అవసరమన్నారు. విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కీలక పాత్ర పోషించిందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం అమలులో రాజీవ్ గాంధీ పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఓబీసీ జాతీయ కమిషన్ 2018లో రాష్ట్రాల హక్కులను తీసుకున్నదని, మీరు చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ సరిదిద్దుతున్నట్లు చెప్పారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును తెచ్చినట్లు అధిర్ ఆరోపించారు.
రిజర్వేషన్లపై సీలింగ్‌ను పెంచాలని చాలా రాష్ట్రాలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ తెలిపారు. కుల వ్యవస్థ ఉన్నందు వల్లే దేశంలో రిజర్వేషన్లు అవసరం వచ్చాయన్నారు. అణగారిన వర్గాలను అభివృద్ధిపరిచేందుకు రిజర్వేషన్ వ్యవస్థ తప్పదని అధిర్ తెలిపారు. జ్యోతిరావ్ పూలే గురించి కాంగ్రెస్ నేత మాట్లాడారు. మరాఠా రిజర్వేషన్ల గురించి చెప్పిన అధిర్.. మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. అధిర్ రంజన్ మాట్లాడుతున్న సమయంలో సభలో సోనియా గాంధీ కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

