Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
Space Wedding : అంతరిక్షంలో ఉన్న వరుడితో టెక్సాస్‌లో వధువు వివాహం. 18 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జరిగిన ఈ పెండ్లి ఇప్పటికీ ప్రత్యేకమైనదిగానే రికార్డుల్లో భద్రంగా ఉన్నది. అంతరిక్ష కేంద్రంలో ...

మనం ఎన్నో పెండ్లిళ్లకు హాజరవుతుంటాం. ఎక్కడైనా ప్రత్యేకంగా జరిగితే పది మందికి చెప్తాం. ఇప్పటివరకు మనం చూడని పెండ్లి ఒకటి అంగరంగ వైభవంగా జరిగింది. అదే అంతరిక్షంలో ఉన్న వరుడితో టెక్సాస్‌లో వధువు వివాహం. 18 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జరిగిన ఈ పెండ్లి ఇప్పటికీ ప్రత్యేకమైనదిగానే రికార్డుల్లో భద్రంగా ఉన్నది. అంతరిక్ష కేంద్రంలో (Space Wedding) పనిచేస్తున్న రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్‌చెంకో వివాహం.. టెక్సాస్‌లో ఉన్న కటారినా డిమిత్రివ్‌ను వివాహమాడాడు. ప్రపంచంలో ఇలా అంతరిక్షం నుంచి వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా యూరి మాలెన్‌చెంకో నిలిచారు.
రష్యాకు చెందిన యూరి గగారిన్ 1961 ఏప్రిల్ 12 న అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రపంచంలో తొలి మానవుడు అయ్యాడు. గగారిన్ సాధించిన ఈ వార్షికోత్సవం సందర్భంగా 2003 లో ఒక పార్టీ జరిగింది. ఇక్కడే యూరి మాలెన్‌చెంకో, కటారినా డిమిత్రివ్ చూపులు కలిశాయి. అనంతరం 2003 ఏప్రిల్ నెలలో నిర్వహించిన రష్యా ఎక్స్‌పెడిషన్-7 లో యూరి మాలెన్‌చెంకో అంతరిక్షంలోకి వెళ్లారు. మిషన్ నుంచి తిరిగి రాగానే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మిషన్‌కు వెళ్లడానికి ముందీ వీరి వివాహ తేదీ ఆగస్టు 10 అని నిర్ణయించారు. అయితే, ఆగస్ట్ మొదటివారంలో పూర్తికావాల్సిన మిషన్.. అక్టోబర్ వరకు పొడిగించారు. దాంతో వీరి పెండ్లికి అన్ని సన్నాహాలు పూర్తవడంతో.. వాయిదా వేసుకోవడం ఇష్టం లేని యూరి మాలెన్‌చెంకో తన ప్రేయసిని అంతరిక్షం నుంచే వివాహం చేసుకోవడానికి సమ్మతం తెలిపాడు. రష్యా నిబంధనల ప్రకారం వివాహానికి వధూవరులు ఇద్దరూ హాజరుకావాలి. అయితే, కటారినా చాలా కాలంగా టెక్సాస్‌లో నివసిస్తున్నది. టెక్సాస్ నిబంధనల ప్రకారం ఇద్దరూ పెండ్లికి హాజరుకావాల్సిన అవసరం లేదు.
ఇదే సమయంలో నాసా అభ్యంతరపెట్టింది. అంతరిక్ష కేంద్రానికి వ్యక్తిగత విషయాలకు వాడుకోవడానికి అనుమతించలేదు. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. వీరి పెండ్లిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. తుదకు నాసా తన సమ్మతిని తెలుపక తప్పలేదు. ఇంకేం వీరి పెండ్లికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. చివరకు వీడియో కాల్ ద్వారా ఇద్దరు పెండ్లి ప్రమాణాలు చేసుకొని ఒక్కటయ్యారు. ప్రపంచంలో ఇదే తొలి, చివరి పెండ్లిగా నిలిచిపోనున్నది. ఈ పెండ్లి తర్వాత అంతరిక్ష సంస్థలు ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వినియోగించుకోవడంపై నిషేధం విధించాయి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
2013 : మాస్కోలో ప్రారంభమైన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు
1977 : పదకొండేండ్ల తర్వాత ఉత్తర ఐర్లాండ్‌లో పర్యటించిన బ్రిటీష్ రాణి ఎలిజబెత్
1966 : చంద్రుని కక్ష్యలోకి చేరుకున్న ప్రపంచంలోనే తొలి అంతరిక్ష నౌకగా నిలిచిన ఆర్బిటర్-1 ను ప్రయోగించిన నాసా
1822 : సిరియాలో భారీ భూకంపం సంభవించి 20 వేల మంది దుర్మరణం
1793 : ప్యారిస్‌లో ప్రారంభమైన ప్రసిద్ధ లౌవ్రే మ్యూజియం
ఇవి కూడా చదవండి..
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

